Thursday, September 8, 2016

ఏవి అశ్వమేధయాగంతో సమానం?


ఏవి అశ్వమేధయాగంతో సమానం?సాహితీమిత్రులారా!


మనం అనేక పనులు చేస్తుంటాం.
వాటిలో ఏది ఎంత గొప్పదో తెలియదుకదా
ఈ శ్లోకం చూడండి .

దరిద్రాయ కృతం దానం
శూన్య లింగస్య పూజనమ్
అనాథ ప్రేత సంస్కారం
అశ్వమేధ సమం విదు:

దారిద్ర్యంతో బాధపడే వారికి దానం చేయడం.
పూజాపురస్కారాలు లేకుండా శూన్యంగా
పడిఉన్న శివలింగాన్ని పూజించడం.
అనాథగా పడిఉన్న శవానికి దహన
సంస్కారాలు జరిపించటం -
అనే ఈ మూడు మహాత్కార్యాలు.
ఇవి అశ్వమేధయాగంతో సమానమైనవి.
వీటిలో ఏది ఆచరించినా
అపారమైన పుణ్యం ప్రాప్తిస్తుంది.

No comments:

Post a Comment