Saturday, September 3, 2016

భక్తి అని దేన్నంటారు?


భక్తి అని దేన్నంటారు?


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూడండి
భక్తి అంటే ఏమిటో కవి ఎంత చక్కగా వివరించాడో

అంకోలం నిజబీజసంతతి వయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు స్సరి ద్వల్లభం
ప్రాప్నోతీహయథా, తథా పశుపతే: పాదారవిందద్వయం
చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సాభక్తి రిత్యుచ్యతే

ఊడుగుచెట్టు తన విత్తనాలను తన వైపుకు ఆకర్షించినట్లు -
అయస్కాంతం సూదిని లాగినట్లు-
సాధ్వి భర్తను ఆకర్షించినట్లు-
నది సముద్రంవైపుకు ఆకర్షితమైనట్లు -
పరమేశ్వర పాదారవిందాలను విడువకుండా
ఎల్లపుడు మనసునందు నిలుపుకోవటాన్నే భక్తి అంటారు - అని భావం

No comments:

Post a Comment