Saturday, September 10, 2016

తప్పు చేసిన దానికే శిక్షించాలి కదా!


తప్పు చేసిన దానికే శిక్షించాలి కదా!


సాహితీమిత్రులారా!

ఇదేమి చమత్కారమో చూడండి

ఒక స్త్రీ వ్యభిచరించినది. దానికి దండనగా రాజు
శిరోముండనము శిక్షగా విధించాడు
అప్పుడు ఆమె ఇలా ప్రశ్నించిందట-

అష్టాదశాశ్చ స్మృతయో వదన్తి
యత్రాపరాధ: ఖలు తత్రదండ:
కృతేపరాధే సతిచోరుమూలే
కుతశ్శిరోముండన మాయతాక్ష్యా:

ఏ భాగం తప్పుచేస్తే
ఆభాగమునకే శిక్షవిధించవలెనని
అష్టాదశ(18)స్మృతులూ చెబుతున్నాయి.
తప్పుచేసింది ఊరుమూలమైతే
శిరోముండనం ఎందుకు విధించారు?
- అని భావం

No comments:

Post a Comment