Friday, September 2, 2016

తనక్రింద వేడైతేనే కరిగేది


తనక్రింద వేడైతేనే కరిగేది


సాహితీమిత్రులారా!

సజ్జనుల హృదయం ఎలాంటిదో
చెప్పెడిదీ శ్లోకం చూడండి.

సజ్జనస్య హృదయం నవనీతం
వర్ణయన్తి విబుధా: తదళీకమ్
అన్యదేహ విలసత్ పరితాపాత్
సజ్జనో ద్రవతి నో నవనీతమ్

సజ్జనుల హృదయం
నవనీతమని కవులు పోలుస్తారు.
అది సత్యదూరము. ఎందుకంటే
ఇతరుల దేహమునకు
పరితాము వచ్చినపుడు సజ్జనుడు కరిగిపోతాడు
కాని వెన్నకరగదు.
తనక్రింద వేడి వస్తేగాని వెన్నకరగదు.


No comments:

Post a Comment