Tuesday, September 6, 2016

విద్య కొరకు వెదకు విలువ దెలియు


విద్య కొరకు వెదకు విలువ దెలియు


సాహితీమిత్రులారా!

నేటి చదువులు ఎలా ఉన్నయో?
ఒకనాడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు చదువును గురించి అడిగితే
చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ అన్నాడట.
ఈనాడు విద్యార్థులు ఏమర్మమెరిగి చదువుతున్నరో!

నేటి విద్య పరిస్థితి గురించి తన్నీరుగారి ఈ పద్యం చూడండి

బ్రతుకు బాటనుఁజూపు బడిపంతులప్పుడు
         బడిబాటఁ బట్టెను పంతులిపుడు
ఆచార్యు దైవమ్ము  ఆనాడు శిష్యకు
         శిష్యుడే దైవంబు చెప్పనిపుడు
మంచిబాట నడువ మందలించెనపుడు
         తిప్పలుఁదప్పవు తిట్టనేడు
శివధనుస్సును విరచినది యెవరనగా?
         నేనుగాదు యెవరో! నేటి పలుకు
ఉచిత విద్యయన్న ఉచితమ్ముగా దోచు
ధనముఁబెట్టిఁ గొన్న దర్పమగును
చదువు బ్రతుకుబాట సాగనిలువలేదు
విద్య కొరకు వెదుక విలువ దెలియు


నేటి విద్యావ్యవస్థలోని ఇబ్బందులను
దీనిలో కళ్ళకు కట్టారు తన్నీరు బాలాజిగారు

No comments:

Post a Comment