Tuesday, September 6, 2016

మహాత్ముల ఔదార్యం గొప్పది


మహాత్ముల ఔదార్యం గొప్పది


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి ఔదార్యమంటే ఎలాంటిదో

చాతక: త్రిచతుర: పయ: కణాన్
యాచతే జలధరం పిపాసయా
సోపి పూరయతి విశ్వంభసా
హన్త హన్త! మహతా ముదారతా!

చాతకపక్షి దాహంతో మేఘుని
మూడు నాలుగు చినుకులను మాత్రమే
(తన అవసరానికి) యాచిస్తుంది.
 మేఘుడు జలంతో ప్రపంచాన్నే ముంచేస్తాడు.
ఆహా! మహాత్ముల ఔదార్యం ఎంత గొప్పది.
(అడగటంలో గొప్పది - చాతకపక్షి.
 ఇవ్వడంలో  గొప్పవాడు - మేఘుడు)

No comments:

Post a Comment