Saturday, September 3, 2016

తమతమ భాగ్యములు ఎంతలో మారునో


తమతమ భాగ్యములు ఎంతలో మారునో


సాహితీమిత్రులారా!


అభిజ్ఞానశాకుంతలంలోని  ఈ శ్లోకం చూడండి
ఎంత చమత్కారంగా ఉందో!

యాత్యేకతోzస్తశిఖరం పతి రోషధీనా
మావిష్కృతారుణ పురస్సర ఏకతోzర్క:,
తేజోద్వయస్య యుగప ద్వ్యపనోదయాభ్యాం
లోకో వియమ్యత ఇవాత్మదశాంతరేషు
                                 (అభిజ్ఞానశాకుంతలమ్ - 4-1)

సూర్యోదయ వర్ణన -
ఒకవైపు చంద్రుడు అస్తగిరి చేరుకొన్నాడు.
మరోవైపు సారథి అరుణుని ముందుంచుకొని
సూర్యుడు ఉదయించుచున్నాడు
ఈ విధంగా తేజశ్శాలురైన సూర్య చంద్రులిద్దరిలో
ఒకరు అస్తమించుట ఒకరు ఉదయించుట చూడగా
మానవులకు తమతమ భాగ్యములు ఎంతలో మారిపోగలవో!
తెలుస్తున్నది -  అని భావం.

No comments:

Post a Comment