Thursday, August 11, 2016

లేనివాఁడు నీవు లేనివాఁడు


లేనివాఁడు నీవు లేనివాఁడు


సాహితీమిత్రులారా!


శ్రీనాథుని స్వభావము తెలిపే
లక్ష్మీస్తుతి పద్యాలు చూడండి.

పండితుఁడాతఁ డాతఁడు ప్రభావసమగ్రుఁడతండు శూరుఁడా
తండు వివేకి యాతఁడు వదాన్యుఁడతండు మహాకులీనుఁడా
తండు కళావిదుండతఁడు ధన్యుఁడతండు మనోజ్ఞమూర్తి యె
వ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికిఁ బాత్ర మిందిరా !

కమలనయన నీవు కలచోటు కలచోటు
నీవు లేనిచోటు నీరసంబు
కంబుకంఠి నీవుకలవాఁడు కలవాఁడు
లేనివాఁడు నీవు లేనివాఁడు

ఇవన్నీ నిత్యసత్యాలే కదా!
ఆనాటికీ................ఈనాటికీ..............

No comments:

Post a Comment