Sunday, August 7, 2016

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


సాహితీమిత్రులారా!

మున్నీరైనది నాదుగుండియ - ప్రజల్ మూర్ఖత్వమున్ వీడకన్
చన్నరే పెడదారిబట్ట కెవడే సన్మార్గమందుంచగా
విన్నారా యెపుడైన, యేమిటిది? నీ వెన్నండు లోలోన - యీ
తెన్నుంగూర్చి విమర్శ జేసితివె? షిర్దీ సాయినాథ ప్రభూ!   - 21

కన్నుల్ కాయలుగాచె నిన్ను గనగా కష్టాలు లెక్కింపకన్
మన్నున్ మిన్నున యెన్ని జూడగ సుమా మార్గమ్ములన్ దెల్ప - నీ
చెన్నింతైనను జూడమైతిమి గదా శ్రీనాథ మాబాధ - నీ
వెన్నంగా నెపుడైన జూచితివె  షిర్దీ సాయినాథ ప్రభూ!                        -22

ఏదేదో మది లోనలోన దలపన్ ఎన్నాళ్ళుగానుండి - నీ
వేదేదో యొరగింతువంచు సతమున్ ఎంతో బ్రహర్షమ్మునన్
యీదారింబడి వచ్చినాను - యిచటన్ యీలాగు గాంచంగ - నే
దేదో యాయెను నాకు - యేమిటిది   షిర్దీ సాయినాథ ప్రభూ!           - 23

ఏలీలన్ మమునుద్ధరించెదవొ! నీవే యత్నముల్ జేతువో!
కాలంబంతయు నూర్చి బెట్టి యిటులన్ కైమోడ్చి నిల్చుంటి, నా
కేలా యీవ్రతదీక్ష - దక్షుడవు - సాక్షీభూతమై యొప్పు - నీ
శ్రీలాలిత్య మొకింత జూపుమిట   షిర్దీ సాయినాథ ప్రభూ!                   - 24

అరకాసంత దయావిభూతికయి - మేమారాటమున్ జెంద - నీ
వరయంగా మముబోంట్ల నెవ్వరిని - నీయావాసమున్ జేరనీ
వు రహింపంగను - యెంత వింతయిది - నీయూహేదొ మాకంద ద
ద్దిర, సద్దర్మముగాదు నీ తలపు     షిర్దీ సాయినాథ ప్రభూ!                - 25

అది నీగుండె దయా రసంబునకు - మాన్యంబైన పెన్నిక్క యై
నదిగా భక్తులు లోదలంతురు - సరేనా! మంచిదే గాని - నా
కది న్మంగను నొప్పకున్నది - దయా కాంతిచ్ఛటా పూరముల్
యెదపై జల్లిన నాడె మెచ్చెదన్       షిర్దీ సాయినాథ ప్రభూ!              - 26

బ్రతుకంతా కనిపెట్టు కొని నిను - నీపాదాబ్జముల్ నమ్మితిన్
నతులున్ సంస్తులెన్నొ జేసితిని - యీ నావంక రావేమి? - నీ
కతలెన్నో విననాయె నమ్ముటకునై కాసంత చోటేది, కీ
రితిగా దిట్టిది మానుమింకయిన      షిర్దీ సాయినాథ ప్రభూ!              - 27

నాకేమంచు ముందు చూపుయిసుమంతైనన్ మదిన్ లేక బల్
కాకల్ దీరిన వారినంటు కొని నే కష్టాలపాలైతి - నన్
సాకేదేవుడ వీవటంచెఱిగితిన్ సర్వంబు వర్జించి - ని
న్నేకన్నారగ గాంచుచుంటి నిట షిర్దీ సాయినాథ ప్రభూ!                    - 28

రా రా పాన్పు నమర్చితిన్ - పటకుటీరంబందు విశ్రాంతి గా
నీరెండింతయు సోకకుండ పగలే నిద్రింపగా వచ్చు - నా
సారోదంతము కొంతయైన విని - నీస్వాంతంబునన్  నిల్పుకో
ధీరుండంచునుయెంచుచుంటి నిను   షిర్దీ సాయినాథ ప్రభూ!            - 29

ననుసాధింపగ కత్తిగట్టితివొ యీనన్నాదరింపంగ, లో
ననుయుత్సాహము జూపితో తెలియ - కున్నా నిప్డు నీవేగదా
ఎనయంగా నొక నిర్ణయంబుగొను - సర్వేశుండవే! యేది? మే
దిని నీకడ్డము, జేయుమా యికను  షిర్దీ సాయినాథ ప్రభూ!              - 30

No comments:

Post a Comment