ఏది ముసలితనాన్ని కలిగిస్తుంది?
సాహితీమిత్రులారా!
జరామరణాలు లేనివారు ఎవరుంటారు?
అలావుంటే వారిని మానవులనరుకదా!
వయసు వచ్చాక ముసలితనం తప్పదుకదా!
కాని ముసలితనం అంటేనే భయం
మీకులేదా?
ఆ భయం.
కాని ముసలితనం ఏఏదానివల్ల ముందు వస్తుందో
ఈ కవి ఎంత అద్భుతంగా తెలిపాడో చూడండి.
అధ్వా జరా మనుష్యాణాం
అనధ్వా వాజినాం జరా
అమైధునం జరా స్త్రీణాం
అశ్వానాం మైధునం జరా
శక్తి మించిన కాలినడక మనుష్యులకు వార్థక్యం తెస్తుంది.
పరుగెత్తకుంటే గుఱ్ఱానికి వార్థక్యం తెస్తుంది.
పురుష సంపర్కం లేకపోతే స్త్రీలకు తొందరగా వార్థక్యాన్ని తెస్తుంది.
గుఱ్ఱాలకు దాంపత్యక్రీడ వార్థక్యాన్ని తెస్తుంది.
కవి మనుషులకు గుఱ్ఱాలకు పోల్చి
విషయాన్ని చక్కగా వివరించాడు.
No comments:
Post a Comment