Friday, August 19, 2016

పలుకుం దొయ్యలి మోవికాంతికెన


పలుకుం దొయ్యలి మోవికాంతికెన


సాహితీమిత్రులారా!


తెనాలిరామకృష్ణునికి
పాండురంగమహాత్మ్యం కృతిభర్త వేదాద్రిమంత్రి
తనకు ఏవిధంగా తాంబూలాన్ని అందించాడో
ఈ పద్యంలో చెప్పాడు చూడండి.

పలుకుం దొయ్యలి మోవికాంతికెన యౌ బాగాలు నయ్యింతి చె
క్కుల బోలు దెలనాకు ల య్యువిద పల్కుల్ వంటి కప్రంపు ప
ల్కులతో గూడిన వీడియం బొసగె నాకున్ పద్మనాభా ర్చనా
కల నా పావన హస్త కంకణ ఝణత్కారంబు తోరంబుగన్
                                                  (పాండురంగమహాత్మ్యము పీఠిక-29)


సరస్వతీదేవి పెదవి కాంతితో తులతూగే వక్కలు,
ఆమె చెక్కులవంటి తెల్లాకులు(సర్వశుక్లా సరస్వతి -
అని దండి కావ్యాదర్శంలో సరస్వతిని స్తుతించాడు.
సరస్వతి తెల్లనిదని ప్రతీతి అందుకే
ఇక్కడ ఆమె చెంపలను తెల్లనాకులతో పోల్చాడు.)
ఆమె పలుకుల వంటి కర్పూరపు పలుకులతో
వేదాద్రి మంత్రి హస్తకంకణాలు ఝణ ఝణ నినదిస్తూండగా
తాంబూలాన్ని రామకృష్ణులవారికి అందించారట.
(మగవారు కూడ ఆరోజుల్లో కంకణాలు ధరించేవారు.)

No comments:

Post a Comment