Monday, August 8, 2016

రసరాజు గజల్స్ - 2


రసరాజు గజల్స్ - 2


సాహితీమిత్రులారా!

మనం మొన్న రసరాజు గజల్స్ కొన్ని చూశాము
ఇది మరొక అంశం చూడండి.

వేషం బాగున్నపుడే వేదిక దిగిపోవాలి
రంగు చెరిగిపోతే తొలిమెట్టుకు దిగిరావాలి

పాయసమైతే మాత్రం మొగం మొత్తదా ఏమి
పరిధిని కాపాడుటలో మోహం తెగిపోవాలి

కోకిలనే చూడు - గొంతు పదే పదే విప్పదు
కాలమెరిగి ఎవరైనా అలా ఒదిగిపోవాలి

ఆ కిరాయి చప్పట్లే నిత్యం వినిపించవు
అభిమానం నిలుపుకొనే దిశగ ఎదిగిపోవాలి

వర్షం కావలసిందే మొక్కకు రసరాజూ
అతివృష్టిని కోరుకొనే ఆశ చెరిగిపోవాలి

No comments:

Post a Comment