Tuesday, August 9, 2016

బండ మాత్రము పాప మందుండిపోయె!


బండ మాత్రము పాప మందుండిపోయె!


సాహితీమిత్రులారా!

ఒక కవిగారు కవిత్వం లేకుండా
కేవలం ఛందస్సు మాత్రమున్న
పద్యం కవిత్వమనిపింసుకోదు
అని చెప్పిన పద్యం
చూడండి.

రెండు కాకులు కూర్చుండె బండమీద
ఒండెగిరిపోయె నింక నందొండు మిగిలె
రెండవది పోయె - నింక నందొండు లేదు!
బండ మాత్రము పాప మందుండిపోయె!

దీనిలో కేవలం ఛందస్సు మాత్రమే ఉంది
కాని ఒక కవి అల్లిన కవిత్వం వలె లేదుకదా !

No comments:

Post a Comment