Thursday, August 18, 2016

మృగమద సౌరభ విభవ.......


మృగమద సౌరభ విభవ.......


సాహితీమిత్రులారా!

తాంబూలం అనగానే మనకు గుర్తుకు వచ్చే పద్యం
మనుచరిత్రలోని ఈ క్రింది పద్యం

ప్రవరుడు హిమాలయాల్లో పసరుకరిగి ఇంటికి ఎటువెళ్ళాలో
తెలియక చెప్పేవాళ్ళు కనిపించక వెదకు సందర్భంలో
సువాసనాభరితమైన తాంబూలవాసన రావడాన్ని
తెలిపే పద్యం ఇది.

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు దెలుపు నొక్క మారుత మొలసెన్
                                                     (మనుచరిత్రము - 2-24)

కస్తూరి వాసనకంటె రెండింతలు అధికముగా
కర్పూరముతోకూడిన తాంబూలము యొక్క
పరిమళముచేత కప్పబడిన పుష్పాదికములయొక్క
వాసనకలిగి స్త్రీలయొక్క జాడను తెలియజేసే
ఒకానొక వాయువు వ్యాపించెను - అని భావం.

దీన్ని బట్టి ఆకాలంలో మగవారి తాంబూలం ఒకరకమైన వాసనను,
ఆడవారి తాంబూలం ఒకరకమైనవాసనను కలిగించేదిగా
ఉండేవని తెలుస్తున్నది.

రాజులు, ధనవంతులు తాంబూలాలను అనేక
సుగంధద్రవ్యాలతో కలిపి వేసుకునేవారు.
ఆనాటి తాంబూల విశేషాలను ఈ పద్యం తెలియజేస్తోంది.
తాంబూలంలో వాడే వివిధమైన ద్రవ్యాలను బట్టి
అది ఆడవారి తాంబూలం,
ఇది మగవారి తాంబూలం అని తెలిసేది.
దాని వివరాల్లోకివెళితే........

ఆడవారి తాంబూలంలో ఒకపాలు కస్తూరి
రెండు పాళ్ళు కర్పూరము మోతాదుగా వాడేవారు.
అదే మగవారైతే రెండు పాళ్ళు కస్తూరి,
ఒకపాలు కర్పూరము మోతాగుగా వాడేవారు
- అని  పై పద్యం వలన తెలుస్తున్నది.

నేడు కాలంమారి అన్నీ పోయి
రకరకాల బీడాలను వాడుతున్నారు. 

No comments:

Post a Comment