నివ్వల నవ్వల నెవ్వరు నవ్వక........
సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు విద్యానగరంలో గౌడడిండిమభట్టును ఓడించి
ఆయన కంచుఢక్కను పగులగొట్టించి
కనకాభిషేకం పొందిన కొంతకాలానికి కాశీఖండం రాశాడు.
అందులో ఆయన మనసులోని కొన్ని విషయాలు
వింధ్యపర్వతం ద్వారా పలికించాడు
వాటిలో ముఖ్యమైన రెండు పద్యాలు చూడండి.
మేరుపర్వతానికి వింధ్యపర్వతానికి
స్పర్థను కలిగించాడు నారదుడు.
ఆ సమయంలో వింధ్యపర్వతం
తన మనసులో అనుకొన్నదీవిధంగా...
కంటికి నిదురవచ్చునె, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్
వంటకమిందునే, యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగల యట్టి మనుష్యునకెట్టివానికిన్
గంటకుఁడైన శాత్రవుఁడొకండు తనంతటివాఁడు గల్గిఁనన్
ఎవ్వనితో నెచ్చోటనం
జివ్వకుఁ జేఁ జాఁపవలదు చేఁజాఁచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగఁబగసనన్ దీర్పఁదగున్
చూడండి ఎంతటి ఆలోచన చేసిందో వింధ్యపర్వతం.
కాదు కాదు డిండింమభట్టుతో తలపడటానికి
ముందునాటి శ్రీనాథుని మానసికస్థితి.
No comments:
Post a Comment