Tuesday, August 2, 2016

బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు


బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు


సాహితీమిత్రులారా!

బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు అనే సామెత వినే ఉన్నాముగా
ఈ పద్యం చూస్తే నిజమే అనిపిస్తుంది చూడండి.

దశావతారచరిత్రలో ధరణిదేవుల రామయామాత్యుడు
మోహినిని వర్ణించిన సందర్భములోనిది ఈ పద్యం.
అమృతాన్ని దేవదానవులకు పంచుతున్న
మోహినిని బలి చక్రవర్తి చూచిన సందర్భము.

సుదతి వడ్డించునపుడు పయ్యెద యొకింత
తొలఁగ గుబ్బలు సూచు నబ్బలియుఁ బల్క
రింప లేడయ్యెఁ డాఁ బల్కరింపఁ దెలిసి
యట్టె పయ్యెదఁ గప్పునో యను భయమున
                                       (దశావతారచరిత్రము 2-553)

బలిచక్రవర్తి ఉత్తముడే కానీ ప్రహ్లాదునిలాగానే పుట్టుకతో దైత్యుడుకదా!
అందుకే ఆయనను రాక్షసుల వరుసలో కూర్చోబెట్టారు అమృతం త్రాగడానికి
కానీ మోహిని భ్రాంతిలో పడిపోయాడు ఆమె అందానికి అందరూ దాసులైపోయారు.
కొయ్యబారిపోయారు.
ఆ అందం ఎలాంటిదో మరి..........
మోహిని(సుదతి) అమృతం వడ్డించే సాకుతో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చింది
సరిగ్గా అదేసమయానికి మోహిని పైట ఒకింత తొలగింది. ఆమె గుబ్బలు కనిపించాయి.
వాటిని చూస్తూ ఉండిపోయాడే తప్ప అంతటి బలిచక్రవర్తి ఆమెను పలకరించలేదు
కారణం
పలకరిస్తే ఆమె పైటను సవరించుకుంటుందేమో?
గుబ్బలు కనిపించకుండా పోతాయనే భయంతో.

ఏమిటిది రిమ్మతెగులేకదా!

No comments:

Post a Comment