బెబ్బులినైన పట్టి పోనివ్వడు
సాహితీమిత్రులారా!
తిమ్మగజపతి అనే సంస్థాధిపతి బహులోభి.
అందరు తనను అంటున్నారనికూడ తిమ్మగజపతికి తెలుసు.
అలాంటి లోభి నుండి పారితోషికము అందుకొన్నాడొక
కవి అది ఈ పద్యంతో చూడండి.
"ఇవ్వడు ఇవ్వడంచు" జనులెప్పుడు తప్పక చెప్పుచుందు రే
మివ్వడు? అన్యకాంత కురమివ్వడు! సంగరమందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబలనివ్వడు! బెబ్బులినైన పట్టి పో
నివ్వ డసత్యవాక్య మెపుడివ్వడు తిమ్మ జగత్పతీంద్రుడే!
కవి చమత్కారం ఎంత గొప్పదో కదా!
ఇవ్వడు ఇవ్వడు అంటారు తిమ్మగజపతిని అది వాస్తవమే
ఆయన ఏమివ్వడో చూడండి.
పరస్త్రీకి మనసివ్వడు
యద్ధములో వెన్నివ్వడు(పారిపోడు)
శత్రువులను ప్రబలనివ్వడు(ఎక్కవకానీడు)
బెబ్బలినైన పట్టి పోనివ్వడు
అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు
ఇన్నిరకాలుగా ఇవ్వనివాడు - అని మంచి పనులే చూపించాడు కవి
అందుకే ఇవ్వనివాడు పారితోషికమిచ్చాడు.
కవికలం
రాజు కత్తికంటె బలమైనది.
అంటారుకదా!
అది ఇదేనేమో!
No comments:
Post a Comment