Saturday, August 13, 2016

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


సాహితీమిత్రులారా!

శ్రీసాయి శతకములోని 31వ పద్యంనుండి చూడండి.

నీలాకాశములోన భూమిపయినన్ నీటన్ విలోకింప - యీ
గాలిన్ ధూళిని నిండియుందువట - దుర్గారణ్యమందైన - నీ
లీలామానుష విగ్రహంబు కననౌ లేదెందు జూడంగ - నీ
వేలా నాయెదలోన నిల్వవుగ షిర్దీ సాయినాథ ప్రభూ!                          - 31

సరిగా జూడక మున్ను సాకక - రుజాసంసర్గమౌయగ్నిలో
పరితప్తంబగుచున్న నన్నెపుడొహో పట్టించుకోకుండ - యే
లర వేధించెదవీవు ధార్మికుడవే రానీయుమా, సుంత, యా
ర్తి రహింపింపగ నీకు సంతసమ షిర్దీ సాయినాథ ప్రభూ!                       - 32

ప్రజలేమో పరమాప్తుడంచు భజియింపంగా బ్రహర్షమ్మునన్
సుజనస్తోమము నిన్ను గొల్వగను - నీశోభా సముత్తేజముల్
గజలల్లంగను పాడినారు ధరలోకమ్రమ్ముగా నేడు, వా
రిజ బంధు ప్రభ నీదు ప్రాభవము షిర్దీ సాయినాథ ప్రభూ!                     - 33

నీలోనన్ కలదందురంతయును ఆనీవెంతయో యింతకున్
ఆలోచింపగ నాకు శక్యమగునే ఆర్థార్థి కల్పద్రుమా
నాలో యీకలగుండులోల ర - మదాంధ్యమ్మట్లు వేగ్రమ్మ, నే
నేలో యిట్టుల నుంటి చూడు మిక   షిర్దీ సాయినాథ ప్రభూ!               - 34

నీవెంతోనట నీదుచెయ్దిమిలలో నెన్నంగలేరంట - యీ
జీవుల్ నీదగు సృష్టియంట, జగతిన్ జీవాళికిన్ సర్వమున్
నీవేయంట యికేది లేదట - సరే నీ మాటలౌ నందు - యై
తే వక్రోక్తులు లేక బ్రోవుమిక    షిర్దీ సాయినాథ ప్రభూ!                        - 35

అంతంబేదియొ అదియేదియొ సమార్హంబైన త్రోవేదియో
చింతింపం బలునాళ్ళ నుండి శ్రమయే చేజిక్కె నాకింక - యా
కంతైనన్ దెలియంగ రాదు - మునుపేకాంతంబునందుండి - చిం
తెంతో జేసితి నేమిలాభమగు    షిర్దీ సాయినాథ ప్రభూ!                          - 36

ఎటనీపుట్టుక ఎందునుంటివొ నిగారింపంగ షిర్దీకి, జే
రుట నీవెందుకొవచ్చి యచ్చటను - వారుంబోయ దీపాలు -ము
చ్చట గొల్పంగను వెల్గ భూప్రజలు - ఆశ్చర్యాంబుధిన్ మున్గి నా
రిట గాధావళి త్రవ్వుచున్ మిగుల    షిర్దీ సాయినాథ ప్రభూ!                     - 37

అదినీ నిల్చిన నింబ వృక్షమట - నీవాపాదపచ్ఛాయ, నె
న్నిదినాలుంటివొ, యొంటిపాటున, ప్రజల్ నిన్నెన్నకున్నన్ యటన్
ఇది నీవోర్చిత్వదీయ కీర్తలతలన్ యెంతెంతగా పెంచి - నా
యెద నీరూపము నిల్పి నావొగద  షిర్దీ సాయినాథ ప్రభూ!                           -38

ముద్దుల్ మూటగదా ముఖంబు నుడులా మోహాంధ్యమున్ ద్రోచి, సం
పద్దీకంబులునౌచు చెన్నలరు, శోభా ప్రాభవో పేతముల్
నిద్దంబైన మనోజ్ఞ రూపమిటు - సందీపింపగావచ్చి - నా
కిద్దంచున్నొక దారి జూపుమిక  షిర్దీ సాయినాథ ప్రభూ!                                - 39

ఎన్నాళ్లిట్టుల నిన్ను నమ్మినను - నాకేమాయె - నీ నామమున్
అన్నన్నా బలుమంత్రమట్లు సతమున్ యావృత్తిగావించినన్
కన్నామా చిఱుమేలొకండు - రసనా గ్రంచింత నొవ్వంగ - నీ
వెన్నంగా నది యేదొ జేయుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!                                - 40

No comments:

Post a Comment