Friday, August 12, 2016

అగ్ని లేకుండా దహించేవి?


అగ్ని లేకుండా దహించేవి?


సాహితీమిత్రులారా!


శరీరాన్ని అగ్నిలేకుండా దహించేవాటిని
కవి ఈ శ్లోకంలో వివరించాడు చూడండి.

కుభోజనం క్రోధముఖీచ భార్యా
కుగ్రామ వాస: కుజనస్య సేవా
అల్పాచ విద్యా విధవాచ కన్యా
వినాగ్ని షట్ ప్రదహన్తి కాయమ్

కూరలు, పచనము సరిగాలేని భోజనము,
చిరచిరలాడే భార్య,
ప్రయాణ, విద్యా, వైద్య
సౌకర్యాలులేని గ్రామవాసం,
దుర్మార్గుని దగ్గర ఉద్యోగం,
వచ్చీరాని చదువు,
విధవరాలైన కూతురు -
అనే ఈ ఆరు అగ్నిలేకుండా
శరీరాన్ని కాల్చేస్తాయి
- అని శ్లోక భావం.

No comments:

Post a Comment