వంగుటెల్ల ధర్మవర్తనంబు
సాహితీమిత్రులారా!
సింగభూపాలునితో పోతన ఈ పద్యం పలికినట్లు
ఆరుద్రగారు సమగ్రాంధ్రసాహిత్యంలో
ఉటంకించారు.
రసికులైనవారు రమణుల కొకవేళ
వంగుటెల్ల ధర్మవర్తనంబు,
ఈ రసమున విల్లు నారికి లొంగదా
చిత్తజాతరూప! సింగభూప!
ఏదైనా తప్పనిసరిగా, ఒకానొక సమయంలో,
రసజ్ఞులైనవారు తమ ప్రియురాండ్రకు లొంగి ప్రవర్తిస్తే,
అది అధర్మమని ఆరడిపెట్టరాదు.
అది ఒకప్పుడు ధర్మప్రవర్తనమే అవుతుంది.
ఎట్లాగంటే ఒకప్పుడు, ఈరసము(అసూయ, ఈర్ష్య)తో ధనుస్సు
'నారి'కి - (అల్లెత్రాటికి) లొంగి, వంగిపోవటంలేదా - అని భావం.
ఇందులో కవి నారి అనే పదాన్ని
శ్లేషార్థంలో ఉపయోగించాడు.
నారి - స్త్రీ , వింటినారి(అల్లెత్రాడు)
No comments:
Post a Comment