Saturday, August 6, 2016

అతి సర్వత్ర వర్జయేత్


అతి సర్వత్ర వర్జయేత్ 


సాహితీమిత్రులారా!

అతి సర్వత్ర వర్జయేత్ అన్నది తరచూ వింటూంటాం.
దాని పూర్తి శ్లోకం ఇది చూడండి.

అతిరూపాత్ హృతా సీతా అతిదర్పాచ్చ రావణ:
అతిదానాత్ బలిర్బద్ధ: అతి సర్వత్ర వర్జయేత్!

అతిరూపం వలన సీత అపహరింపబడెను.
అతి గర్వంతో రావణుడు నశించెను.
అతిదానంవలన బలి బంధించబడెను.
కావున అతి అన్నిచోట్లను హానికరము
అందుకే దాన్ని వర్జించాలి - అని భావం.

No comments:

Post a Comment