Tuesday, August 23, 2016

వృద్ధనారీ పతివ్రతా!


వృద్ధనారీ పతివ్రతా!


సాహితీమిత్రులారా!

వృద్ధనారీ పతివ్రతా! -  అని లోకంలో
ఒక సామెత వాడటం కద్దు.
దీని పూర్తి శ్లోకం చూడండి.

అశక్తస్తు భవేత్సాధు:
బ్రహ్మచారీ తు నిర్ధన:
వ్యాధితో దైవభక్తశ్చ
వృద్ధనారీపతివ్రతా!


బలహీనుడు మంచివానిగా బ్రతుకుతాడు
ఎందువల్లనగా ఏ దాన్నీ ఎదిరించలేడుగదా!

ధనహీనుడు డబ్బులేనివాడు బ్రహ్మచర్యం పాటిస్తాడు
ఎందువల్లనగా ఏ స్త్రీనైనా కోరితే దానికి డబ్బవసరంకదా!

వ్యాధిగ్రస్తుడు దైవభక్తితో ఉంటాడు
వైద్యుని వల్లకానిది దేవుడేకదా చేయాల్సింది.

వృద్ధనారి పతివ్రతేకదా
ఎటూ వయసు మీరిన ఎవరు కోరుదురు.
కావున
ఈ శ్లోకం  సర్వదా ఆమోదమైనదేగా!

3 comments:

  1. ఇది సందర్భోచితంగామాత్రమే ఆమోదయోగ్యం..సర్వదా కాదు.
    బలహీనులలో మంచివారుండరా?
    ధనహీనులలో మానసికంగాబలమైన బ్రహ్మచారులుండరా?
    వ్యాధిగ్రస్థులలో నిజమైన దైవభక్తులుండరా?
    వృద్ధనారీమణులలో పతివ్రతలుండరా?
    పరులను అవమానించటం ..వృద్ధనారీ పతివ్రతా శ్లోకం యొక్క లక్ష్యంకాదు.

    అలా కొందరు అసమర్థులు అలా తమ గురించి గొప్పగా చెప్పుకొని సమాజాన్ని మభ్యపెడతారని బోధించటం పై శ్లోకం ఉద్దేశ్యం

    ReplyDelete
  2. అల మహాబలశాలి తొలగి దుర్బలుడైన
    సాధు రూపము దాల్చి చదురు జూపు
    ధన మదంబున రేగి , తలగిన పిమ్మట
    బ్రహ్మచర్యము తో విరాగి యగును
    కండ కావరమున కన్ను మిన్నెఱుగడు
    రోగమొదవ భక్త శిరోమణి యగు
    వయసున చెడ దిర్గి , వయసుడిగిన మీద
    కడు పతివ్రతయైన ఘనత లొప్పు

    బలము ధనములు కండలు వయసు సొగసు
    శాశ్వతము కాదు వాటిని విశ్వసించి
    విఱ్ఱవీగుట తగదని , వెనుక నిదిగొ
    నిట్లగు ననుచు శ్లోకమై నిజము దెలిపె .

    ReplyDelete