Tuesday, August 16, 2016

సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ


సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ


సాహితీమిత్రులారా!

పాల్కురికి సోమనాథుని 
వృషాధిప శతకంలోని
ఈ పద్యం చూడండి.

తజ్ఞ జితప్రజ్ఞ యుచితప్రమథానుగతజ్ఞ నమ్రదై
వజ్ఞ కళావిధిజ్ఞ బలవచ్చివభక్తిమనోజ్ఞ ధూతశా
స్త్రజ్ఞ సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ స
ర్వజ్ఞ శరణమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
                                                                    (వృషాధిప శతకం-09)


వృషభావతార శ్రేష్ఠుడవైన ఓ బసవేశ్వరా! బాగుగ తెలిసినవాడా!
చేసిన ప్రతిజ్ఞను నిర్వహించువాడా! ఉత్తములైన శివభక్తుల
ననుసరించు బుద్ధికలవాడా! విధేయులైన భగవత్ జ్ఞానులను కలవాడా!
సమస్త కళల పద్ధతులను తెలిసినవాడా! బలీయమైన శివభక్తి కలిగి ఉండుటచే
మనోహరమైనవాడా! శాస్త్రజ్ఞులను జయించినవాడా! సలక్షణమైన నాద(గాన)
రసము గ్రహించువాడా! యజ్ఞయాగాది కర్మలను నిరసించినవాడా!
సమస్తము తెలిసినవాడా! నీవే నాకు శరణము. - అని పద్యభావం

No comments:

Post a Comment