Monday, August 1, 2016

రసరాజు గజల్స్


రసరాజు గజల్స్


సాహితీమిత్రులారా!

సినీగేయరచయిత రసరాజు -
గజల్ శ్రీనివాసు పై వ్రాసిన గజల్స్ చూడండి.


గజలు శ్రీనివాసులోని ఒక మహత్తుకన్నాను
ప్రజలు చూసి శ్లాఘిస్తే గుండెకత్తుకొన్నాను

కవిలో ఋషి ఉన్నాడని కంజీరా మ్రోగినపుడు
పరవశించి పదేపదే కళ్లు ఒత్తుకొన్నాను

పాటమధ్య మాట ఒకటి పన్నీరై తడిపినపుడు
ఏ తల్లికి కొడుకోయని మురిసి హత్తుకొన్నాను

సేవకంటె శిఖరమేది లేదని గొంచెత్తినపుడు
ఎదలో ఒక థెరిస్సాను నేను విత్తుకొన్నాను

పాట పాడుతూ శ్రోతను పలుకరించినపుడు
ఎడదలోని పడవకు తెరచాప ఎత్తుకొన్నాను

ఆగని చప్పట్లమధ్య సభకు ఊపిరిరాడనపుడు
నేనుకూడ రసరాజై అతని ఎత్తు కన్నాను

No comments:

Post a Comment