వినాశకాలే విపరీత బుద్ధి:
సాహితీమిత్రులారా!
ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుందట.
అందుకే పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
దానికి సంబంధించిన ఈ శ్లోకం చూడండి.
అళీ - కుళీ - వృశ్చిక - వేణు - రంభా
వినాశకాలే ఫలముద్వహన్తి
యథా తథా సజ్జన - దుర్జనానాం
వినాశకాలే విపరీత బుద్ధి:
తుమ్మెద - పీత - తేలు - వెదురు - అరటి -
ఇవి నాశకాలం వచ్చినపుడు ఫలిస్తాయి.
సజ్జనులకు దుర్జనులకు పోగాలమువేళ
విపరీత బుద్ధులు పుడతాయి - అని భావం.
తుమ్మెద, పీత, తేలు, వెదురు, అరటి ఇవి
ప్రత్యుత్పత్తి కాగానే తరువాత ఉండవట
అందుకే అవి వినాశకాలము వచ్చినపుడు
పండుతాయి అంటున్నాడు కవి.
శ్లోక కర్త ఎవరు? తెలియజేయగలరు
ReplyDelete