Monday, August 15, 2016

పెమ్మయ సింగధీమణీ!


పెమ్మయ సింగధీమణీ!


సాహితీమిత్రులారా!

పెమ్మయ సింగధీమణి మకుటంతో గల
కొన్ని పద్యాలను చూడండి.

సత్యములేని చోటఁ దనుసమ్మతిఁ జెందనిచోట, సాధుసాం
గత్యములేనిచోట ధనకాంక్షమునింగినచోట శత్రు రా
హిత్యము లేనిచోట ఋణమీయనిచోటను గాపురంబుఁదా
నిత్యముఁజేయరాదు సుమి నిక్కము పెమ్మయ సింగధీమణీ

వాసనలేనిపువ్వు, బుధవర్గములేనిపురంబు నిత్య వి
శ్వాసములేని భార్య, గుణవంతుఁడుగాని కుమారుఁడున్ సద
భ్యాసములేని విద్య, పరిహాసప్రసంగములేని వాక్యమున్
గ్రాసములేని కొల్వు కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!

పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపురాదు తాఁ
దిట్టక వాదురాదిఁక నెదిర్చిన వైరుల సంగరంబునన్
కొట్టక పేరురాదు కొడుకొక్కఁడు లేక ఫలంబు లేదయా
బట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ!

మనవికి నొక్కయేడు ననుమానపు మాటకు నాఱునెల్లు నే
డనిపెద నన్న మాసమపు నన్పెద పొమ్మనఁ బక్షమౌను తత్
క్షణమిదె యంపితన్న మఱి సంతయు వచ్చును మోక్షమింక నా
మనవికి యెన్నఁడో సుజనమాన్యుఁడ పెమ్మయ సింగధీమణీ!

వద్దన పద్యమేల మఱి పందికి నివ్వెఱ గంధమేల దు
క్కెద్దుకు పంచదారటుకులేల నపుంసకుడైనవానికిన్
ముద్దులగుమ్మయేల నెఱముక్కఱయేల వితంతురాలికిన్
గ్రద్దకు స్నానమేల నగరా విని పెమ్మయ సింగధీమణీ!

8 comments:

 1. మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట అనే పద్యం మీదగ్గర ఉంటే పోస్ట్ చేస్తారా ధాంక్యూ నమస్తే

  ReplyDelete
  Replies
  1. మచ్చిక లేనిచోట ననుమానము వచ్చినచోట మెండుగాఁ గుచ్చితులున్న చోట గుణకోవిదు లుండనిచోట విద్యకున్ మెచ్చనిచోట రాజు కరుణించనిచోట వివేకులుండి రే నచ్చట మోసమండ్రు సుగుణాకర ! పెమ్మయసింగధీమణీ !

   Delete
 2. మంచి పద్యరత్నాలు పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు రమణరాజు గారు, వెంకట రాజారావు మాస్టారు. వీరి పద్యాలు శతకరూపంలో ఉన్నాయా? ఉంటే సదరు శతకం ఎక్కడ లభ్యమవుతుంది?

  అసలు ఈ పెమ్మయసింగధీమణి గారెవరో, ఏకాలపు వ్యక్తో గానీ అద్భుతమైన పద్యాలు వ్రాసినట్లున్నారు. వారి జీవితకాల. గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆ విశేషాలు ఇక్కడ పంచుకుంటే మాబోటివారికి తెలుసుకోవడానికి పనికొస్తుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies

  1. सिम्गधीमणि अनि वुम्दि :) फोटो कूडा वुम्दि :) लम्के लेदंटे एट्ला मरि :)


   नारदा
   जिलेबी

   Delete
 3. జక్కన కవి రాసేడనీ , పెమ్మయ సింగనామాత్యుడికి అంకితమిచ్చాడనీ ప్రచారంలో ఉంది . అందులోని కొన్ని
  పద్యాలు మాత్రం చాటువులుగా ప్రసిధ్దాలు .

  ఆయనది కాదు . నీచ ప్రవృత్తిగలవాళ్ల చెంత చేరితే ,
  గొప్పవాడు నవ్వులపాలౌతాడని చెప్పే పద్యం ఇది .

  ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
  దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
  మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
  అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వెంకట రాజారావు మాస్టారూ.
   చెప్పినవారెవరైనా ఈ పద్యం కూడా చాలా బాగుంది. ఎవరితో కలిసి తిరగకూడదో అనాది నుండీ పెద్దలు చెబుతున్నదే.

   Delete
 4. దయతో ప్రచురణకర్త చిరునామా ఈ మైల్ చేయగలరా ?

  ReplyDelete