మన తెనుగుసీమ
సాహితీమిత్రులారా!
రాష్ట్ర భక్తిభరితమైన హృదయంతో
ఆదిభట్ల నారాయణదాసుగారు
చెప్పిన పద్యం చూడండి.
పాడిపంటలనెల్ల నాడులన్ మించిన దనయము మన మంచి తెనుగుసీమ
కలిమికి నలువనెచ్చెలి కున్కిపట్టు నిచ్చలు మన పుట్టిన తెలుగు సీమ
వేయేండ్లెదురు లేక రాయలు మొదలు రేండ్లలరిన మన మేటి తెలుగుసీమ
తిక్కన పోతన్న తిమ్మన్న వెలసిన మన గొప్ప తెలుగు సీమ
చెలగు నన్నియిమ్ముల మన తెలుగుసీమ
చెలగు పెద్ద యేరుల మన తెలుగుసీమ
తనరు పొడవు గుడుల మన తెనుగుసీమ
పొనరు వేల్పు కొండల మన తెనుగుసీమ
No comments:
Post a Comment