Saturday, July 23, 2016

ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?


ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?



సాహితీమిత్రులారా!

అనంతపంతుల రామలింగస్వామి అనే కవి
1932 వ సంవత్సరంలో శుక్లపక్షము అనే
హాస్యకావ్యాన్ని వ్రాసి ముద్రింపంచారు.
అందులోని కుకవి నింద చేస్తూ వ్రాసిన
పద్యం ఇది
చూడండి.

రసము నే నెఱుగనా?  ప్రారబ్దమిదియేమి?
        ద్రవిడదేశాన్నసత్రము నిడరె?
సముచితాలంకారసమితి నే నెఱుగనా?
       మగువలు ధరియించు నగలు కావె?
యతిని నే నెఱుగనా? క్షితిలోన 
       కాషాయవస్త్రధారుండైనవాడు కాడె?
గురువు నే నెఱుగనా? సరి సరి! అక్షరా
        భ్యసనంహు సల్పిన యతడు కాడె?
శబ్దమన నే నెఱుంగనా?  చప్పుడు గదె?
అనుచు వచియించు అజ్ఞాన జనములోన
అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ
మును రచించుట భాషకు ముప్పు గాదె?

     

3 comments:

  1. మీ రేమేమో చెప్పారు. పాతపద్యం. చాలా బాగుంది. చమత్కారం అద్భుతం. కాని అధునికులు ఏమంటారంటే? ఇవన్నీ తెలియాలా కవిత్వం వ్రాయాలంటే? మాకు భావం ముఖ్యం! పెద్దపెద్దమాటలు వల్లించటం‌ పండితాహంకారం అని. అందుచేత ఏమి తెలుస్తున్నదయ్యా అంటే ఒకప్పుడు ఉచితమైన భాషణం మరి యొకప్పుడు తద్విరుధ్ధం అవుతున్నది. ఒకప్పుడు శాస్త్రీయం అన్నది మరొకప్పుడు తద్విలోమం అవుతున్నది. ఒకప్పుడు హాస్యంగా పరిగణించ బడినది కాలాంతరంలో అపహాస్యంగా లెక్కకు వస్తుంది. ఒకప్పుడు కవిత్వసామగ్రి యన్న గౌరవాన్ని పొందినవి కాలప్రభావం చేత ముతకపండితులచేతి పనిముట్లుగా హేళనకు గురికావలసి వస్తుంది. ఒకనాడు కవులుగా గౌరవాదరాలు పొందినవారు కాలం మారేసరికి నిరాదరణకు గురికావటం‌ జరుగుతుంది. ఆహా ఏమి ఈ‌ కాలమహిమ! భాషకు ఏది మెప్పో ఏది ముప్పో అన్నదీ వీధివివాదం స్థాయిలో గొడవగా మారుతుంది సుమా.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారి,
      మీరు స్పందించి నందులకు ధన్యవాదాలు. మీరు వ్రాసిన వ్యాఖ్య సరైనదే కాని ఆనాటి ఆ కవి భావన నాణేనికి ఒకవైపైతే, మీరు వ్రాసి వ్యాఖ్య మరోవైపు అని నాభావన. ఏది ఏమైనా మీ వ్యాఖ్యలు సదా మా బ్లాగుకు అవసరమని నేను భావిస్తున్నాను. మీకు మరొకసారి ధన్యవాదాలు.

      Delete


  2. శ్యామలీయం వారిది అనుభవజ్ఞులైన వారి సెహభేషు వంద నయా పైసల మాట !

    జిలేబి

    ReplyDelete