Thursday, July 7, 2016

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


ఈ పంకంబున దింపినావు, సరిలే! యెన్నాళ్ళు యీ యూదిలో
రాపిళ్ళన్బడి గట్టుజేరగ - దివారాత్రంబులీలీల - ఆ
నీ పాదాబ్జము లాశ్రయింపవలె - కానీ నీవు నన్నిట్లు - యే
యే పాట్లొందగ జేతువో - తుదకు షిర్దీ సాయినాథ ప్రభూ!   - 6


నీ పంచంబ్రతు కంతయింతలుగ - నే నెంతోముదంబార - కాం
తా పుత్రాదుల గూడి వచ్చితిని - సంధా నింప నాకెట్లు - యే
నై పధ్యంబున నుండి గూర్చెదవొ! - విన్నాణంబు జూపించి - యిం
కీ పల్మాటలు యేల నాకు నిట షిర్దీ సాయినాథ ప్రభూ!   - 7


సరెలే! మంచిదిలే రహింపగన్ - నీ సాహిత్యమింతేనులే?
మరియాదల్ మనకేల చెప్పుమిక - నీ మంచింతకున్ యేదియో
గురిలేకున్నది - యేది చూపుము - అహో కోపంబునీకేల, మా
దిరిగా నొక్కటి చూపరాద?  కన షిర్దీ సాయినాథ ప్రభూ?        - 8


ఈవార్థక్యములోన యెంతటి సుఖం బీవిత్తువో! యంచు - నా
భావంబందున నిన్ను నిల్పితిని - భాస్వత్కాంతులీనంగ - నా
కై వారంబుల విందువో! విమల సౌఖ్యాళిన్ రహింపింతువో!
దేవా! చేవదలిర్పగా మనుపు షిర్దీ సాయినాథ ప్రభూ!   - 9


నన్నేలా యిటుజేసి నావు ధరలో నన్ - నేనె నీ కంటికిన్
అన్నా! లోకువయైతినే - నిజముగా ఆప్తుండవైతేని - నా
కెన్నంగా సమకూర్చు, కోరినది - నాడే, విశ్వసింతున్ మదిన్
ఎన్నళ్లిట్టుల నూరకుందునిక షిర్దీ సాయినాథ ప్రభూ!        - 10


No comments:

Post a Comment