వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత
సాహితీమిత్రులారా!
ఒకమారు శ్రీకృష్ణదేవరాయలు, పట్టపురాణి తిరుమలాదేవి
కంచివరదరాజస్వామిని సేవించటానికి వెళ్ళారట.
తిరుమలాదేవి వరదరాజస్వామికి నమస్కరిస్తోంది.
ఆ గుడి లో ఆచార్య నరసింహదీక్షితన్ అనే గొప్ప
పండిత పూజారి తిరుమలదేవిని చూచి ఆశువుగా
ఈ క్రింది శ్లోకం చెప్పారట.
చూడండి.
కాంచిత్ కాంచన గౌరాంగీం వీక్ష్య సాక్షాదివ శ్రియం
వరద: సంశయాపన్న: వక్షస్థల మవైక్షత
బంగారం వంటి పసుపుపచ్చని శరీరంతో సాక్షాత్తూ
లక్ష్మిదేవిలా ఉన్న తిరిమలదేవిని చూచి,
వరదరాజ స్వామికి అనుమానం వచ్చి,
తన గుండెలను తడిమి చూసుకున్నాడట.
(తన గుండెలమీద ఉండవలసిన లక్ష్మిదేవి దూరంగా అక్కడ
నిలబడిందేమిటని అనుమానం వచ్చింది స్వామికి)
ఎంత చక్కగా
చమత్కారంగా ఉంది ఈ శ్లోకం.
No comments:
Post a Comment