Tuesday, July 19, 2016

ఎంత కుమిలితివో క్షమియించు వాణి


ఎంత కుమిలితివో క్షమియించు వాణి


సాహితీమిత్రులారా!

ఒక అవధాని పృచ్ఛకుని
కోరికమేరకు
దిగజారిన కవిత్వపు పోకడలపై
వాణీహృదయవేదనను
ఈ క్రింది పద్యంలో
వివరించారు చూడండి.

అధివాస్త కవిత్వమని బుకాయించుచు వెర్రి గీతలు గీకి వేయువారు
గణయతి ప్రాస లక్షణ శృంఖలమ్ముల త్రెంచినామని యికిలించువారు
సంధి సమాస దోసముల పాటింపక విప్లవమని రంకె వేయువారు
ఒకటి రెండు మార్లూపి యూపి చదివి చప్పట్లకై సైగ సలుపువారు
పొట్టి పంక్తిని అటుమీద పొడుగు పంక్తి
పెంచి భావాలకై దేబెరించువారు
గేయమని వీరు చేసెడి గాయములకు
ఎంత కుమిలితివో క్షమియించు వాణి

- అని వాణీహృదయవేదనను వాకృచ్చెను.
ఇది నిజమేకదా!
 ఇందులో కొంచెం వ్యంగ్యంగా అనిపించినా వాస్తమే.

1 comment:

  1. మంచి పద్యమండీ ...పంచుకున్నందుకు ధన్యవాదములు .. ఈ పద్యం గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారిదండీ

    ReplyDelete