Tuesday, July 26, 2016

అడుగుదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో


అడుగుదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో


సాహితీమిత్రులారా!


శ్రీపాద పృష్ణమూర్తి గారు తన నైషధీయచరిత్రలో
దమయంతి సౌందర్యాన్ని వర్ణించే
సందర్భములోని ఈ పద్యం చూడండి.

తలఁకక మమ్ము రే ల్చెఱచుదాయను గెల్చియ వానిచుట్టలన్
మెలపితి మంటి కొల్చి మన, మీరును దొల్లిటిబామునందు మా
తలఁబడి నా రటం చడుగుఁదమ్ము లనం గని మ్రొక్క వచ్చునో
వెలయఁగఁ దేం ట్లనం దగియె విప్పినయాసకిసోఁగ పెన్నెఱుల్
                                                  (నైషధీయచరిత్రము - ద్వితీయతరంగము - 68)


ఈ పద్యంలో పాదపద్మాలు చెబుతుంటే
తుమ్మెదలు వింటున్నాయి.
మేము బలాఢ్యులము.
రాత్రులలో మమ్ములను చెఱచెడి శత్రువు చంద్రుడు.
వాని గెల్చి వాని చుట్టాల(నక్షత్రాల) మమ్ము కొలిచి సేవించేట్లు చేశాము.
నఖరూపంలో ఈ జన్మలో మమ్మంటి సేవిస్తున్నాయి.
మేమింతవారము.
తుమ్మెదలారా!
మీరు ఇంతకుముందు మా నెత్తిపై పడి త్రొక్కి తప్పుచేసి ఉన్నారు.
మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పగా భయపడి తుమ్మెదలు
పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయట.
అంటే  దమయంతి శిరోజాలు పాదాలపై పడుతున్నవని - తాత్పర్యం.
అంత పొడవాటి వెంట్రుకలు దమయంతివి అని.

No comments:

Post a Comment