Monday, July 4, 2016

సూర్యుండు పరుగులు వారు నంబరమునందు


సూర్యుండు పరుగులు వారు నంబరమునందు


సాహితీమిత్రులారా!

నల్లి ఎంతటిదో చెప్పే పద్యాలు చూడండి.

ఒక అవధానంలో రామకృష్ణకవులు అప్పటి
సుప్రసిద్ధ విదూషక వేషధారి శ్రీనివాసరావు
అడిగిన దానికి చెప్పిన
పద్యం చూడండి.

నల్లి కాటుకు భీతిల్లి యే విష్ణుండు జలధిలో వటపత్ర శాయి యయ్యె
నల్లి కాటుకు భీతిల్లి యే శంకరుండెల్లవేళల నుండు వల్లకాట
నల్లి కాటుకు భీతిల్లి యే దేవతా జ్యేష్ఠు డబ్జాన నాసీనుడయ్యె
నల్లి కాటుకు భీతిల్లి యే సూర్యుండు పరుగులు వారు నంబరమునందు
హరిహర హిరణ్య గర్భాదులైన సురలె
నల్లికాటున కిట్లు భీతిల్లుచుండ
మనుజమాత్రులు భీకర మత్కురాణల
ధాటి కోర్వంగ నెంతటి పాటివారు

దేవతల నివాసాలను నల్లి బాధతో
సమన్వయించి అందంగా చెప్పిన
ఈ పద్యం ఒక ప్రాచీన చాటువుననుసరించిందే
అనవచ్చు
ఆ చాటువు........

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ! 

No comments:

Post a Comment