పొగ త్రాగనివాడు దున్నపోతైపుట్టున్
సాహితీమిత్రులారా!
ఇది అందరు అంటూంటారు
మరీ పొగత్రాగేవాళ్ళంతానూ.
ఇదేమిటి అంటే దీనికి
మన కవులు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో!
ఈ క్రింది పద్యాలవల్ల తెలుస్తుంది చూడండి.
ఇది ఎంత చమత్కృతో చూడండి.....
పొగాకు పుట్టుకకు సంబంధించిన పద్యం.
ఖగపతి అమృతము తేగా
భుగభుగమని పొంగి పొరలి భూస్థలి పడి తా
పొగ చెట్టయి జన్మించెను
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
(గరుత్మంతుడు అమృతం తెస్తుంటే పాత్రలో
నుంచి పొంగి నేలపై పడిన చుక్కే పొగ చెట్టైందట.)
పొగత్రాగడమంటే, చుట్ట తాగడం లాంటి దన్నమాట.
మరీ చిత్రం పొగత్రాగడం వల్లే భీముడు దుర్యోధనుణ్ని ఓడించాడట.
దుర్యోధనుడు అది త్రాగనందుకే ఓడాడట.
చూడండి ఆ పద్యం..
పొగ త్రగ నేర్చి భీముడు
పగఱన్ పొగరడచె నాజి బాహాశక్తిన్
పొగ త్రావని దుర్యోధను
డిగిలించెను రణములోన నిహిహీ అనుచున్
ఈ పద్యం చూడండి ఇదెంత చమత్కారమో!
రావణ యుద్ధంబందున
బావనుడగు లక్ష్మణుండు పడి మూర్ఛిలినన్
ఆవల బొగ చెట్టుండిన
బావని సంజీవని కేల పరుగెత్తు నృపా!
(రామరావణ యుద్ధంలో పొగచేట్టే ఉంటే,
లక్ష్మణుని మూర్ఛ తేర్చటానికి హనుమంతుడు
సంజీవని కోసం ఎందుకు పరుగెడతాడు - అని భావం.)
మరి ఇప్పుడేమో పొగత్రానే కూడదని వచ్చి పడింది
దానికి అలవాటు పడ్డవాళ్ళు
ఇప్పుడేమంటారో!
ReplyDeleteభగభగ పొగ వలదే యన
సిగారు విడిచెను జిలేబి చీకాకుపడెన్
బిగిబిగి గూర్చెను కందము
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
జిలేబి
పొగద్రాగుట నేరము గద
ReplyDeleteపొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్
పొగ గుఱిచి యట్లు బలుకుట
తగునే యది మీకు సామి ! దారుణ మేగా
This comment has been removed by the author.
ReplyDeleteఅది ఓ కవి చెప్పిన మాట. దాన్ని డిలీట్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఆరోగ్య పరంగా అయితే తీసుకోకూడదు.
ReplyDelete