ముక్తింగతా: రామ పదానుషంగాత్
సాహితీమిత్రులారా!
ఈ చమత్కార శ్లోకం చూడండి.
తెలిసి అనుకొన్నా! తెలియక అనుకొన్నా!
శివా! శివా! అని తలచుకొంటే మోక్షం(కైలాసం)
ప్రాప్తిస్తుందంటారు - పెద్దలు.
అలాంటిదే ఈ శ్లోకం.
వనే చరామ: వనితాన్ హరామ:
నదీన్ తరామ: నభయం స్మరామ:
ఇతీరయన్త సతతం కిరాతా:
ముక్తిం గతా: రామ పదానుషంగాత్
వనంలో సంచరింతము(వనే చరామ: )
వనితలను హరింతము(వనితాన్ హరామ:)
నదుల దాటుదము(నదీన్ తరామ:)
భయమును స్మరింపవద్దు(నభయం స్మరామ:)
- అని తమలో తాము ఎల్లప్పుడు పలకటంతో అప్రయత్నంగా
రామ - పదసంబంధం తో కిరాతులు మోక్షం పొందారు - అని భావం.
No comments:
Post a Comment