Saturday, July 16, 2016

ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్


ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్


సాహితీమిత్రులారా!

లోకంలోని వారంతా ఎలాంటి వారంటే
ముందువారు ఏంచేశారో వెనుకవారు దాన్ని
అలాగే అనుసరించడం అలవాటైపోయింది.
ఏమన్నా మాట్లాడితే ఇది అనాదిగా వస్తూన్నదే అంటారు.
ఒక విధంగా చెప్పాలంటే గొర్రెదాటు పద్ధతే.

ఈ శ్లోకం అదే చెబుతూన్నది చూడండి.

గతానుగతికో లోకో నలోక: పారమార్థిక:
ఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్

ఈ లోకంలో ప్రజలు ముందువారిని - వెనుకవారు గుడ్డిగా అనుసరిస్తారు.
అంతేకాని, అందులోని పరమార్థం గుర్తించరు, ఆలోచించరు.
ఏలానది ఒడ్డున నేను ఇసుక లింగం చేసి నా రాగి చెంబు పోగొట్టుకున్నాను.
(గ్రహణం వేళ చెంబుకు గుర్తుగా ఇసుకను ప్రోగుపెట్టి స్నానానికి వెళ్ళాడు
ఒక బ్రాహ్మణుడు స్నానంచేసి వచ్చేసరికి
అదే ఆకృతిలో లోకులు ఇసుక లింగాలను పెట్టారట.
తన చెంబు పెట్టుకొన్న ఇసుక కుప్ప ఏదో?  తెలుసుకోలేక
రాగిచెంబు వదిలేసుకొని ఇంటి వెళ్ళాడట. ఇది శ్లోకంలోని విషయం.)

2 comments:



  1. లింగము గురుతుగ చెంబును
    చంగము బెట్టెను జిలేబి జలకాలాడన్
    అంగట బోవగ చకచక
    లింగము శతకోటి గనె నలినితీరమునన్

    జిలేబి

    ReplyDelete
  2. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతా,
    అభ్యాసేన న లభ్యంతే, చత్వార స్సహజా గుణాః
    దాతృత్వం ప్రియంగా మాట్లాడడం, ధీరత్వం ఉచితానుచిత జ్ఞానం,ఈ నాలుగూ సహజంగా వచ్చేవే కానీ నేర్చుకుంటే వచ్చేవి కావు మీ వ్యాఖ్య సహజంగా ఉంది.

    ReplyDelete