Sunday, July 24, 2016

నిర్జీవం దహతే చితా!


నిర్జీవం దహతే చితా!


సాహితీమిత్రులారా!

మన పూర్వులు అనేక విషయాలను
వారు అనుభవించి చెప్పినవే
సూక్తులుగా మనం చెప్పుకుంటున్నాము.
ఈ శ్లోకం చూడండి.

చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్ర విశేషత:
సజీవం దహతే చింతా! నిర్జీవం దహతే చితా!

చితా(చితి)-  చింతా అనే రెండు  సమానాలే
సున్నమాత్రమే తేడా.
తగులబెట్టటంలో కూడా ఎక్కువ తేడాలేదు
చింత సజీవంగా తగులబెడుతుంది.
చితా(చితి) నిర్జీవుని  తగులబెడుతుంది.

1 comment: 1. చితి చింతల సారూప్య మి
  వి, తరుణ మేగిన జిలేబి, విగతుని గాల్చున్
  చితి, సహజీవనమును జే
  సి తలగొరుగును గద చింత సిత్రము జూడన్

  జిలేబి

  ReplyDelete