Monday, July 18, 2016

రామ! మోక్షరామాధ్యక్షా!


రామ! మోక్షరామాధ్యక్షా!


సాహితీమిత్రులారా!

వేంటగిరి సంస్థానంలో యాచభూపతి కోరికమేరకు
మోచర్ల వెంకనకవి చెప్పిన
"" -కారము మొదట, "క్ష" - కారము అంతములో
ఉండే కందపద్యాలు శ్రీరామస్తవంగా
చెప్పమనగా ఆశువుగా చెప్పబడినవి.
ఇవి చూడండి.

షాక్షరమాదిగఁ జెప్పెద
నీక్షణమునఁ గందనివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు
రాక్షసహర రామ! మోక్షరామాధ్యక్షా!

షడ్రాజన్యాంబరయుత
రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
తేడ్రు డ్యాగారపరి
వ్రాడ్రీవర రామ! మోక్షరామాధ్యక్షా!


షణ్మిధునాంభస్సంభవ
రాణ్మానితనూత్నరత్న రాజన్యకుటో
ద్యన్మండితాంతరీక్ష వి
రాణ్మూర్తీ రామ! మోక్షరామాధ్యక్షా!

షట్పదలసితోద్యస్మిన్
త్రిట్పదలాంగప్రకాశధీరాజితగ్రా
జట్పదజటిపటనానా
రాట్పూజిత రామ! మోక్షరామాధ్యక్షా!

అని చెప్పారట.
ఏమి ఆశుధార!
ఏమి పద్యాలు!

4 comments:


  1. స్సరసీజా
    తేడ్రు డ్యాగారపరి
    వ్రాడ్రీవర అనగానేమి?

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete


  3. Is it talking about the horoscope of Rama ?


    జిలేబి

    ReplyDelete

  4. ఎంత ఆలోచించినా ఊహూ ఒక్క ముక్కా అర్థం కాలే ; బ్లాగు లోకం లో దీనికి అర్థం చెప్పగలవారు నాకు తెలిసి శ్యామలీయం వారొక్కరే ; చెబ్తే అర్థం ఆయనే చెప్పాలి


    జిలేబి

    ReplyDelete