Friday, July 22, 2016

రాభణో నతు రావణ:!


రాభణో నతు రావణ:!


సాహితీమిత్రులారా!

నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే
మూర్ఖులు చాలామందే ఉన్నారు.
అలాంటిదే  ఇదీనూ చూడండి.
ఒక మూర్ఖుడు రావణడుని రాభణుడు అన్నాడట
దానికి ఒక పండితుడు సమర్థిస్తూ
చెప్పిన శ్లోకం ఇది.


కుంకరణే భకారోస్తి భకారోస్తి విభీషణే
రాక్షసానాం కులశ్రేష్ఠ:  "రాభణో" నతు రావణ:!


రావణ - కుంభకర్ణ - విభీషణులు అన్నదమ్ములు.
కుంభకర్ణునికి - కారం ఉంది.
అలాగే విభీషణునికి - కారం ఉంది.
కాబట్టి రాక్షసకులంలో పెద్దవానిని రాణుడు అనటమే
సమంజసం సముచితము రావణుడు కాదు.

1 comment:

  1. రామనామే మకారోస్తి మకారోస్తి శ్యామ నామే !

    దేవానాం కిం శ్రేష్టోస్తి ?


    జిలేబి


    చీర్స్
    జిలేబి

    ReplyDelete