Sunday, July 10, 2016

నీవే సమర్థుడవు!


నీవే సమర్థుడవు!


సాహితీమిత్రులారా!

కొన్ని పనులకు కొందరే సమర్థులు
అన్ని పనులు అందరూ చేయలేరు.
అలాగే నీవు ఈ పనికి తగినవానివని
కవి ఒక రాజును సంబోధిస్తూ .........
చెప్పిన ఈ శ్లోకం చూడండి.

దగ్ధం ఖాండవ మర్జునేనచ వృథా దివ్యౌషధై ర్భూషితమ్
దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకాపురీ స్వర్గభూ:
దగ్ధ: సర్వసుఖాస్పదశ్చ మదనో హాహా! వృథా వృథా శంభునా
దారిద్ర్యం ఘనతాపదం భువి నృపాణాం కేనపి నో దగ్ధ్యతే

రాజా!  అర్జునుడు దివ్యౌషధ నిలయమైన
ఖాండవము వ్యర్థంగా తగులబెట్టాడు.
స్వర్గభూమియై బంగారుతో నిర్మింపబడిన
లంకాపట్టణం వాయుపుత్రుడు దగ్ధం చేశాడు.
సర్వసుఖాస్పదుడైన మన్మథునుని శంభువు
వృథాగా తగులబెట్టాడు.
భూమిలో మానవులకు ఘనతాపమును కలిగించు
దారిద్ర్యమును మాత్రం ఎవ్వరిచేతనూ
తగులబెట్టబడలేదు
అందుకు నీవే సమర్థుడవని భావం.

No comments:

Post a Comment