కుచయుగం చక్రే ముదా నర్తనమ్
సాహితీమిత్రులారా!
పూర్వం మన తెలుగుయువతులు నదుల్లోనూ చెరువుల్లోనూ
స్నానంచేసి వస్తూవస్తూ బిందెతో ఇంటికి నీళ్ళు తెచ్చేవారు.
నదిలో లేదా చెరువులో స్నానం చేసేముందు కొంగు కప్పుకొని
రవిక విప్పి - దాన్ని నీళ్ళలో ముంచి - వంగి
ఱాతిపై ఉతికి తరువాతగాని స్నానం చేసేవారుకాదు.
ఒకానొక కవికి ఈ దృశ్యం కంటపడగా
చమత్కారమైన ఈ శ్లోకం చెప్పాడట.
చూడండి.
ఆంధ్రీ కాచన మన్మథాశుగ నిభా కౌశేయకం కంచుకమ్
కక్షాత్ బాహుయుగేన కోమల తరేణాదాయ - తూర్ణం జలే
మగ్నీకృత్య కుచద్వయస్య కృశదం త్వాం మర్దయామీతి సా
పాషాణే తదపీడయత్ కుచయుగం చక్రే ముదా నర్తనమ్
ఒక ఆంధ్ర సుందరి స్నానికై నదిరేవులోకి వెళ్ళింది.
రవికను, కొంగుముసునుండి తీసినది -
నీటిలో ముంచినది. (కుచాలను పీడించే నిన్ను ఱాతిమీద
కొడతాను చూడు అన్నట్లుగా) ఱాతిపై ఉతకడం మొదలు పెట్టింది.
వంగి ఆమె ఉతుకుతుంటే కుచాలు(తమ శత్రువుకు ఱాతి దెబ్బలు
తగులుతున్నాయికదా - అని) సంతోషంతో నాట్యం ఆడినవి -
అని భావం.
ఎంతటి ఊహ!
ఎంత చమత్కారం!
ReplyDeleteలోలా కుచంబు నొప్పిన
చోలక దబదబ దృషత్తు జోరున నేడ్వన్
మాలిని స్వయంభువుల సరి
సల్లాపము నొప్పెనోయి సలిలరయమునన్ !
జిలేబి