ఔరభ్రకం అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!
ఇంగ్లీషులోలాగే మనకు గుంపులకు పదాలు ఉన్నాయి.
వాటిని ఇక్కడ గమనిద్దాము.
అజకం - మేకల గుంపు
గజత - ఏనుగుల గుంపు
ఔరభ్రకం - గొర్రెల గుంపు
గోత్రము - ఆవుల గుంపు
ధైనుకము - ఆవుల గుంపు
ఔక్షకం - ఎద్దుల గుంపు
ఔష్ట్రకము - ఒంటెల గుంపు
కార్మము - జోళ్ళ వరుస
కారీషము - ఎండు పిడుకల కుప్ప
వేణుకము - వేణువుల వరుస
గ్రామ్యత - గ్రామాల గుంపు
మాణవ్యము - బడిపిల్లల సమూహము
జనత - జనుల గుంపు
సహాయతము - సహాయకుల గుంపు
పాశ్య - త్రాళ్ళ ప్రోగు
ధూమ్య - ధూమముల వరుస
No comments:
Post a Comment