Thursday, July 7, 2016

వీనిలో కొన్నయినా చేతకావా?



వీనిలో కొన్నయినా చేతకావా?


సాహితీమిత్రులారా!

సమాజంలో బ్రతకడానికి మనం అనేకం నేర్చుకుంటున్నాము.
అలాగే సంఘాన్ని ఆకర్షించాలంటే ఏవి రావాలని?
ఓ కవి ఈ శ్లోకంలో వివరించాడు చూడండి.


ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,
తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
వీనిలో కొన్నయినా చేత కాకపోతే సంఘాన్ని ఆకర్షించలేరు
- అని భావం.
దీన్ని బట్టి మనకు వీటిలో ఎన్ని వచ్చో? చూసుకుంటే
మనం సంఘాన్ని ఆకర్షించగలమా? లేదా? అనేది తెలుస్తుంది.

No comments:

Post a Comment