ఖగవాహనుతోడ కాలకంఠుడు పల్కెన్
సాహితీమిత్రులారా!
పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్ - అనడమేకాదు.
ఏకంగా గిరీశం కన్యాశుల్కంలో
శివునితో విష్ణువుకు
ఈ విధంగా చెప్పించాడు
చూడండి.
శిష్యుని ఎంగిలి చుట్టకోసం
ఈ పద్యం చెప్పినమ్మిస్తాడు
పురాణ ప్రమాణాలుగా.
పొగచుట్టకు సతిమోవికి
అగణితముగ మద్యమునకు, అమృతంబునకున్
తగ నుచ్ఛిష్టము లేదని
ఖగవాహనుతోడ కాలకంఠుడు పల్కెన్
ఇది మరో చిత్రం చూడండి.
త్రిలోక సంచారి నారదుడు వైకుంఠానికి వెళ్ళినాడు.
ఆ సమయంలో త్రిమూర్తులు చుట్టకాలుస్తూ
ఆనంద పారవశ్యంలో ఉన్నారు.
నారదుడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
దానికి వారి సమాధానం చూడండి.
నారదుడు - మీరుం బొగ త్రావుదురా
వారిజభవ! వామదేవ! వైకుంఠహరీ?
త్రిమూర్తులు - ఓరీ! నారద వినరా!
ఈరేడు జగంబులందు ఇది ముఖ్యమురా!
అన్నారట.
తప్పు చేస్తూ సమర్థించుకొనేవారి వాలకం ఇంతేకదా!
ReplyDeleteసెగ వేడికి గాలినిడున్
జగమున కెల్లవె లుతురుని జమునిచ్చువటన్
పగవాడి నిగొట్టున్; పం
ఖ, గవా,హను, తోడ కాలకంఠుడు పల్కెన్
జిలేబి
గిరీశం లాంటివాళ్ళు దేవుళ్ళని సైతం పచ్చకామెర్లతోనే చూస్తారు కదా.... అలాంఛి వారున్నంత కాలం చూశారూ....పిచ్చి బుచ్చెమ్మలు
ReplyDelete