Thursday, July 28, 2016

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


సాహితీమిత్రులారా!


పంతాలేలను నీకునాకు నిక - నే పట్టింపులున్ వద్దు - యీ
చింతాసాగరమీదు దారి యెదియో చెప్పంగనే విందు - నీ 
పొంతన్నే వసింపగా యెటులనే పొల్పారు కార్యంబు - నే
నెంతల్ సేయగనౌనొ చెప్పుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!                  - 16

ఏవ్యాపారము నందు లోబడక - నీవే నాకునౌనంచు, యే
దివ్యానందముగోరి చేరితినొ! నీధీశక్తిం జూపించి, నా
కవ్యక్తంబగు నట్టి దేదొ యిడు - కాంక్షల్దీరు లేకున్న - యే
లీ వ్యాపార మిదంత యింతగను షిర్దీ సాయినాథ ప్రభూ!               - 17

కాదన్నన్ విడు వాడనా! యెవరు - నీ కారీతి వాక్రుచ్చిరో
యోదంబందున బడ్డ యేన్గుగతిగా నందున్ గాదె నీకేమి - నా
బాధల్ యెక్కవు చూచుచుంటతగునా?  పల్మారు పిల్వంగ, నీ
కేదేదో యయినట్లు నుంటివిటు షిర్దీ సాయినాథ ప్రభూ!                - 18

ఆయెంబోయెను మంతనాలు సతమున్ వ్యాయావమమున్ జేయ, యీ
నాయందంతటి శక్తిలేదు - రుజలా నన్నాక్రమించెన్ - వృధా
నే యాచించుట నిన్ను యెన్నగను - నిన్ నిందింపగానేల - యా
ధ్యేయంబెద్దియొ! చెప్పు మా యిపుడె? షిర్దీ సాయినాథ ప్రభూ!     - 19

పారావారము నీదుచుంటిని - ప్రభావంబింత జూపించి - యే
తీరంబో! యొకదాని జేర్చుము - కృపాబ్ధీ! నన్ను కావంగ, నీ
వే, రారమ్మిక, యాలసింప తగునా? వేదార్థ! విన్నావు కా
దే రుచ్యంబగునే? సహింపగను షిర్దీ సాయినాథ ప్రభూ!               - 20

No comments:

Post a Comment