మేరు మందర సమాన మధ్యమా
సాహితీమిత్రులారా!
మల్లినాథసూరి అను నామాంతరముగల
పెద్దిభట్టు అనే ప్రముఖ పండితుడు
అనేక కావ్యాలకు వ్యాఖ్య వ్రాసినవాడు.
ఒకానొకరోజు ఆయన భార్య ఆయన్ను
"అందరను వర్ణిస్తున్నావు
నన్ను వర్ణింపవేమి?"
అని అడిగిందయట.
దానికి ఆయన ఆమె ముచ్చటెందుకాదనాలని
ఈ శ్లోకం చెప్పారట.
చూడండది.
మేరు మందర సమాన మధ్యమా, తింత్రిణీ దళ విశాల లోచనా
అర్క శుష్కఫల కోమల స్తనీ, పెద్దిభట్ట గృహిణీ విరాజతే!
మేరు పర్వతము వంటి నడుముతో -
చింతాకులవలె విశాలములైన నేత్రములతో -
ఎండి జిల్లోడు వంటి కుచములతో
పెద్దిభట్టు భార్య ప్రకాశించుచున్నది -
అని భావం.
కాదనకుండా ఎంత చమత్కారంగా
భార్యముచ్చట తీర్చాడు కవిగారు
No comments:
Post a Comment