దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!
సాహితీమిత్రులారా!
ఈ హాస్యపూరిత పద్యం తిలకించండి.
తీటగల భాగ్యశాలికి
నీటుగలుగు గోళ్ళు - వేడినీళ్ళు లభింపన్
తాటించి బఱుకసాగిన
తీటయె దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!
తీట అంటే తెలియనివారు ఉండరు అది
ఒక దురద పుట్టించు చర్మవ్యాధి.
దురద ఎక్కువైన ఎవరున్నా ఎటువంటి భావనలేకుండా
గోళ్ళతో రక్తం వచ్చినా! వదలకుండా బరుకుతారు.
వేడినీళ్ళు దురద పట్టేచోట పోస్తే అదోక సుఖంగా ఉంటుంది
అందుకే కవి ఈ తీటను దేవేంద్ర పదవి అంతటిదిగా
హాస్యపూరితంగా చమత్కరించాడు.
ReplyDeleteధీటుగ జిలేబి తీటెను
వాటము జూచెను కమింటు వారిధి గానన్
వేటుల తీరెను దురదయు
చోటిది గదవే రమణికి షోకులు నేర్వన్ :)
జిలేబి