కమ్మని క్రొత్త చెంగల్వ విరిలు
సాహితీమిత్రులారా!
శ్రీనాథమహాకవి
కాలంలోని గోదావరీ ప్రాంతం ఎలా వున్నదో?
ఈ పద్యంతో తెలుస్తుంది. చూడండి.
ధరియింప నేర్చిరి దర్భ బెట్టెడి వ్రేళ్ళ లీలమాణిక్యాంగుళీయకములు
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల తారహారములు ముత్యాల సరులు
కల్పింప నేర్చిరి గంగ మట్టియమీద కస్తూరి కాపుండ్రకములు నొసల
చేర్చంగ నేర్చిరి శిఖల నెన్నడుమల కమ్మని క్రొత్త చెంగల్వ విరులు
ధామముల వెండి పైడియు తడబడంగ
బ్రాహ్మణోత్తములగ్రహారములయందు
వేదవేదాంగవేత్తలై ఐహిక భోగాలకు దూరంగా ఉండే
విప్రులే దర్భముడులకు బదులుగా మణులు పొదిగిన
ఉంగరాలు, జంధ్యాలతో పాటు తారహారాలు,
నొసటి విభూతిరేఖలతోపాటు కస్తూరి,
శిఖలమధ్య కలువపూలు, అవీ ఎర్రకలువలు -
ఇళ్ళలో వెండి బంగారాలు - ఇటువంటి స్థితిలో అలరారుతూ
ఉంటే ఇతరుల పని చెప్పవలసిన దేముంది.
అంత సస్యశ్యామలమైనది గోదావరీ ప్రాంతం.
రాణ్మంహేంద్రవరం రాజులకాణాచి...అంటారు కదా... ఇంకా తెలుపగలరు...
ReplyDelete