Sunday, July 3, 2016

అక్షౌహిణి అంటే ఏమిటి?



అక్షౌహిణి అంటే ఏమిటి?


సాహితీమిత్రులారా!

అక్షౌహిణి అనే పదం మనకు సుపరిచితమే.
ఇది మహాభారత యుద్ధంలో పాల్గొన్న సంఖ్యను చెప్పే
సమయంలో వినవస్తుంది. భారతయుద్ధంలో ఇరుపక్షాలకు కలిపి
18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది.
 అంటే ఎంత మంది అవి తెలియాలంటే
ఈ విధంగా చేసిన తెలుసుకోవచ్చు.
మొదట ఈ సేనాసమూహ పదాలకు
వివరణ తెలుసుకుందాము.
పత్తి - 1 రధములు - 1 ఏనుగు - 3 గుర్రాలు - 5 మంది కాల్బంట్లు
సేనాముఖము - 3రధములు- 3ఏనుగులు - 9గుర్రాలు  - 15 మంది కాల్బంట్లు
గుల్మము - 9రధములు. - 9ఏనుగులు. - 27గుర్రాలు  -  45 మంది కాల్బంట్లు
గణము- 27రధములు. - 27ఏనుగులు- 81గుర్రాలు  - 135మంది కాల్బంట్లు
వాహిని - 81రధములు - 81 ఏనుగులు - 243గుర్రాలు . - 405 మంది కాల్బంట్లు
పృతన - 243రధములు. - 243ఏనుగులు  - 729 గుర్రాలు . - 1215 మంది కాల్బంట్లు
చమువు - 729 రధములు. - 729ఏనుగులు 2187 గుర్రాలు . - 3645 మంది కాల్బంట్లు
అనీకిని - 2117రధములు.- 2117ఏనుగులు. - 6561 గుర్రాలు  - 10135మంది కాల్బంట్లు
అక్షౌహిణి - 21875రధములు- 21875ఏనుగులు- 65610గుర్రాలు . - 109350మంది కాల్బంట్లు

3పత్తులు - 1సేనాసముఖము
3సేనాముఖములు - 1 గుల్మము
3గుల్మములు - 1గణము
3గణములు - 1వాహిని
3 వాహినులు - 1పృతన
3పృతనలు - 1చమువు
3 చమువులు - 1 అనీకిని
5 అనీకినిలు - 1అక్షౌహిణి

అక్షౌహిణికి ఒక్కొక పుస్తకంలో ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది.
ఇందులో అనేక అభిప్రాయాలున్నాయి.
అందువల్ల దీనికి ప్రామాణికత లేకుండా పోయింది.

No comments:

Post a Comment