Saturday, July 16, 2016

ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?


ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?


సాహితీమిత్రులారా!

సంస్కృతంలో "విహస్య"(=నవ్వి) అనేది
ప్రాథమికునికి షష్ఠీవిభక్తిగా అనిపిస్తుంది.
ప్రాథమికునకు "విహాయ" (=విడచి)
చతుర్థిగా అనిపిస్తుంది. అట్లాగే అహం(=నేను),
కథం(=ఎట్లు) ఈ రెండునూ రామశబ్ద మాత్ర జ్ఞానం
ఉన్నవానికి ద్వితీయా విభక్తిగా తోస్తుంది.
ఈవిధంగా అనిపించడం భాషాజ్ఞానశూన్యలక్షణము.
అలాంటివానికి నేను భార్యను కాలేను అంటూంది
ఒక యువతి.
ఆ శ్లోకం చూడండి.

యస్య షష్ఠీ చతుర్థీస్యాత్ 'విహస్య' చ 'విహాయ' చ
'అహం' 'కఛం' ద్వితీయాస్యాత్ ద్వితీయాస్యామహం కథమ్?

ఎవనికి "విహస్య" - "విహాయ" అను ధాతువులు
షష్ఠీ - చతుర్థీ విభక్తులుగా గోచరిస్తాయో,
'అహం'- అను సర్వనామము 'కథం' - అను అను అవ్యయము
ద్వితీయా విభక్తులనిపించునో అలాంటి అజ్ఞానికి నేను ఎట్లు?
ద్వితీయ(భార్య)ను కాగలను?
(రామ వంటి శబ్దాలకు మాత్రమే విభక్తులుంటాయి
విహస్య - విహాయ అనే ధాతువులకు,
అహం అనే సర్వనామానికి, కథం అనే అవ్యయానికి
విభక్తులుండవని
రామ శబ్దం మాత్రమే  చదువుకున్నవాడు
వీటిని విభక్తులుగా భ్రమిస్తాడు.)

1 comment:

  1. సమ్యక్ భణితం సుష్టు వివృతం ఏవమేవ పశ్చాదపి ఆశాస్మహే కుశలినో భవంతు

    ReplyDelete